తెలంగాణ

telangana

ETV Bharat / state

రబీ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధం - మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్

ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు మిర్యాలగూడ ఆర్డీవో స్పష్టం చేశారు. లాక్​డౌన్​తో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సీఎం ఆదేశాల ప్రకారం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.

governament ready to paddy purchase in miryalaguda
రబీ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధం

By

Published : Mar 31, 2020, 8:17 PM IST

రబీలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్​ అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. లాక్​డౌన్​తో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారా యంత్రాగం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతు పండించే చివరి గింజ వరకు మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఐకేపీ కేంద్రాలు, పట్టణంలో మిల్లర్ల ద్వారా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. స్థానికంగా మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల రైతులు మిల్లులో అమ్మడానికే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు.

రబీ ధాన్యం కొనుగోలుకు రంగం సిద్ధం

ఇదీ చూడండి:కరోనా నుంచి కోలుకున్న 11మంది డిశ్చార్జ్‌

ABOUT THE AUTHOR

...view details