నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఖుదాబక్షుపల్లి గ్రామ శివారులోని శివారాత్రి చంద్రయ్య ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బాంబుల పరిశ్రమ నిర్మాణ పనులకి సత్వరమే అనుమతులు ఇవ్నాలంటూ గ్రామస్థులు స్వచ్ఛందంగా తహసీల్దార్‌కి వినతిపత్రం సమర్పించారు. బాంబుల పరిశ్రమ వారు నిర్మాణ పనులకు అనుమతి తెచ్చుకున్నప్పటికి గ్రామ పంచాయతీ తీర్మానంలో కొంతమంది రాజకీయ నాయకులు జాప్యం చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ కంపెనీ తమ గ్రామంలో ఏర్పాటు చేసినట్లయితే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని... వెంటనే కంపెనీకి అనుమతులు ఇవ్వాలని కోరారు.
'బాంబుల పరిశ్రమకు అనుమతి ఇవ్వండి' - బాంబుల కంపెనీ
బాంబుల పరిశ్రమకు అనుమతి ఇవ్వాలని రెవిన్యూ అధికారికి మర్రిగూడ మండలం ఖుదాబక్షుపల్లి గ్రామస్థులు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో కంపెనీ ఏర్పాటైతే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
'బాంబుల పరిశ్రమకు అనుమతి ఇవ్వండి' ఖుదాబాక్షుపల్లి గ్రామస్థులు