తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఏపీ ఉద్యోగులను ఇక్కడికి రానివ్వం..' - నాగార్జున సాగర్​ జెన్​కో ఉద్యోగుల ధర్నా

నాగార్జున సాగర్​ జెన్​కో కార్యాలయం వద్ద ఇంజినీర్లు నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్​ జెన్​కో నుంచి రిలీవ్​ అయిన 655 మంది ఇంజినీర్లు రాష్ట్రంలో చేరితే ఇక్కడి యువత ఉపాధి కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

'దశాబ్ద కాలంపాటు యువత ఉపాధి కోల్పోతుంది'
'దశాబ్ద కాలంపాటు యువత ఉపాధి కోల్పోతుంది'

By

Published : Mar 19, 2020, 1:46 PM IST

'దశాబ్ద కాలంపాటు యువత ఉపాధి కోల్పోతుంది'

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ జెన్​కో కార్యాలయం వద్ద జెన్ కో ఇంజినీర్లు నిరసన వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ జెన్​కో నుంచి రిలీవ్ అయిన 655 మంది ఇంజినీర్లు తెలంగాణలో చేరడం వల్ల ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం రిలీవ్​ చేసిన 655 మందిని వెనక్కి పంపించాలని డిమాండ్​ చేశారు.

ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణకు వస్తే దశాబ్ద కాలంపాటు రాష్ట్ర యవతకు ఉపాధి ఉండదని జెన్​కో ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. వారిని రానివ్వబోమని తిరిగి పంపించేరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:8 వేలు దాటిన కరోనా మరణాలు.. 2లక్షలకు పైగా కేసులు

ABOUT THE AUTHOR

...view details