కేఏ పాల్ పార్టీ అభ్యర్థిగా గద్దర్, మునుగోడు నుంచి పోటీ - KA Paul campaign in munugode by poll
15:52 October 05
మునుగోడులో కేఏ పాల్ పార్టీ అభ్యర్థిగా గద్దర్
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరుపున ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రజాగాయకుడు గద్దర్ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న పాల్‌తో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల అశీర్వాదం కోసం రేపటి నుంచే ప్రచారం ప్రారంభిస్తానన్నారు.
"భారత రాజ్యాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం నోటు తీసుకోని ఓటు వేయడం నేరం.. అందరికి అదే చెబుతున్నా నోటు తీసుకోకుండా మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. ఇదే నినాదంతో ఎన్నికల ప్రచారంలోనికి వెళ్తా.. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న మిత్రుడు కేఏ పాల్‌తో కలిసి పని చేయాలనేది నా ఉద్దేశం.. అందుకే నా మద్దతు పాల్‌కు ఉంటుంది. రేపటి నుంచే మా ప్రచారం ఉంటుంది."-గద్దర్, ప్రజాగాయకుడు
ఇవీ చదవండి: