ఎగువ నుంచి కృష్ణమ్మ పరుగులు మొదలు అయ్యాయి. శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే నీరు.. పెద్ద ఎత్తున నాగార్జునసాగర్ జలాశయంలోకి చేరుతోంది. సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 539.80 అడుగులకు చేరుకుంది. సాగర్ నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 187.63 టీఎంసీలకు చేరుకుంది. సాగర్ ఇన్ఫ్లో 40,259 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1500 క్యూసెక్కులుగా ఉంది.
నాగార్జున సాగర్ జలాశయానికి కృష్ణమ్మ పరుగులు - నాగార్జున సాగర్ జలాశయానికి పెరిగిన వరద ఉద్ధృతి
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి పెద్ద ఎత్తున నీరు విడుదల అవుతోంది. సాగర్ మొత్తం నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 539.80 అడుగులకు చేరుకుంది.
నాగార్జున సాగర్ జలాశయానికి కృష్ణమ్మ పరుగులు
సాగర్ జలాశయం నుంచి ఎలాంటి విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేయలేదు. నాగార్జునసాగర్ జలాశయం నీటి మట్టం గత ఏడాది క్రితం నేటి సమయానికి 507.63 అడుగుల వద్ద ఉంది.127 టీఎంసీల నిల్వ ఉండగా ఈ ఏడాది ముందుగానే 60 టీఎంసీల నీరు వచ్చి చేరింది.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు