తెలంగాణ

telangana

'కేసీఆర్​కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెరాస ఏర్పాటయ్యేదా?'

సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవారా? అని... పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్​కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెరాస ఏర్పాటయ్యేదా అని నిలదీశారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రసంగంపై పొన్నాల స్పందించారు.

By

Published : Apr 15, 2021, 3:34 AM IST

Published : Apr 15, 2021, 3:34 AM IST

Former PCC president Ponnala Lakshmaiah responds on CM KCR's speech in Nagarjunasagar by poll elections campaign
సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ప్రసంగంపై స్పందించిన కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య

ఆనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్​కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెరాస ఏర్పాటయ్యేదా? గులాబీ జెండా ఎగురవేసే వారా? అని... పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారా? అని నిలదీశారు. నాగర్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని కేసీఆర్​ చేసిన ప్రసంగంపై పొన్నాల స్పందించారు.

పొత్తు ఎందుకు...

కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న కేసీఆర్ నాడు హస్తం పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. 2002 కంటే ముందు 50 రూపాయల పెన్షన్ ఇచ్చినట్లు చెబుతున్న ముఖ్యమంత్రి... అప్పుడేందుకు నోరు మెదపలేదని విమర్శించారు. కేసీఆర్ తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా తెలంగాణ గురించి కానీ, ఇక్కడి సమస్యల గురించి కానీ మాట్లాడారా అని నిలదీశారు.

ఇద్దరు సభ్యులకే బిల్లు పాస్​ అవుతుందా?...

ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో 500 లకు పైగా పార్లమెంటు సభ్యులున్న చోట ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాస్ అవుతుందా అని అన్నారు. ముఖ్యమంత్రి ఉండి నిండు సభలో కోటి రెడ్డి అనే వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పడం... ఎన్నికల హామీ కిందకు రాదా అని నిలదీశారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ నివారించడానికి కృష్ణ నది నీళ్లను 95% గ్రామాలకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. అక్కడ ఫ్లోరైడ్ లేకుండా చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

ఇదీ చదవండి: ప్రతిధ్వని: బంతి బంతికి బెట్టింగ్.. రోడ్డున పడుతున్న కుటుంబాలు

ABOUT THE AUTHOR

...view details