తెలంగాణ

telangana

ETV Bharat / state

'గిరిజనులకు ఇచ్చిన హామీలు సీఎం కేసీఆర్ నెరవేర్చటంలేదు' - Nalgonda District Latest News

నల్గొండ జిల్లా గేమ్యానాయక్ తండాలో గిరిజన పోరు పాదయాత్రను భాజపా నేతలు ప్రాంభించారు. గిరిజన హక్కులు, 12శాతం రిజర్వేషన్లు అమలు, పొడు భూముల సమస్యల పరిష్కారానికి యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. యాత్రను మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ మొదలు పెట్టారు.

గిరిజన పోరు పాదయాత్ర ప్రాంభించిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్
గిరిజన పోరు పాదయాత్ర ప్రాంభించిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్

By

Published : Mar 20, 2021, 2:53 PM IST

గిరిజనులకు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఆరోపించారు. సాగర్ ఉప ఎన్నికల్లో భాజపా జెండా ఎగరాలన్నారు. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం గేమ్యానాయక్ తండాలో గిరిజన పోరు పాదయాత్రను ప్రాంభించారు.

భాజపా జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, ఎన్నికల సమన్వయ కర్తలు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, డా.రవి నాయక్​తో కలిసి మొదలు పెట్టారు. గిరిజన హక్కులు, 12 శాతం రిజర్వేషన్ల అమలు, పొడు భూముల సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేపట్టారని రవీంద్ర నాయక్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:డబ్బు లేకుంటే ఎన్నికల్లో పోటీ చేయకూడదు: చిన్నారెడ్డి

ABOUT THE AUTHOR

...view details