తెలంగాణ

telangana

ETV Bharat / state

యువత మోదీ నాయకత్వాన్ని బలపరుస్తోంది: పెద్దిరెడ్డి - సాగర్​ ఉపఎన్నికలు

భాజపా అభ్యర్థి రవి కుమార్​ను సాగర్​ ఉపఎన్నికల్లో గెలిపించాలని భాజపా నేత పెద్దిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, తెరాస పాలన చూసిన ప్రజలు... వారికి స్వస్తిపలికి భాజపాను గెలిపించేందుకు సిద్ధమయ్యారంటూ ధీమా వ్యక్తం చేశారు.

former minister peddi reddy campaign for bjp candidate in sagar by election
యువత మోదీ నాయకత్వంను బలపరుస్తోంది: పెద్దిరెడ్డి

By

Published : Apr 15, 2021, 12:30 PM IST

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి రవికుమార్​ను గెలిపించాలని భాజపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. మోసపూరిత వాగ్ధానాలు చేస్తున్నారని కేసీఆర్​పై​ మండిపడుతున్నారు.

యువతరం అంతా భాజపా నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. సాగర్​ ఉప ఎన్నికల్లో ప్రజల్లో మార్పు కనిపిస్తోందని వెల్లడించారు. కాంగ్రెస్, తెరాస పాలన చూశారని... మార్పు కోసం భాజపాను గెలిపించాలనుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి ఓటు వేసిన దండగేనన్నారు.

ఇదీ చూడండి:ఇవాళ ఒక్కరోజే ఉంది... అప్రమత్తంగా ఉండండి..!

ABOUT THE AUTHOR

...view details