మాజీ ఏపీపీఎస్సీ సభ్యులు కేవీ సత్యనారాయణ వర్ధంతి సభ నల్గొండ జిల్లా అనుములలో జరిగింది. ఈ సభలో మాజీ మంత్రి జానా రెడ్డి పాల్గొన్నారు. కేవీ సత్యనారాయణ మన ముందు లేకపోవడం బాధకరమన్నారు.
కేవీ సత్యనారాయణ గొప్ప నేత: జానారెడ్డి - appsc former member satyanarayana latest news
మాజీ ఏపీపీఎస్సీ సభ్యులు కేవీ సత్యనారాయణ గొప్ప నేత అని మాజీ మంత్రి జానా రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా అనుములలో సత్యనారాయణ వర్ధంతి సభలో పాల్గొన్నారు.
జానారెడ్డి
సత్యనారాయణ తనకు గురుసమానులని.. రాజకీయ ఓనమాలో నేర్పించారని చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో సత్యనారాయణ అంటే తెలియని వారు ఎవరు ఉండరని అన్నారు. అనంతరం సత్యనారాయణ విగ్రహాన్ని జానారెడ్డి ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:'కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి నిరోధక పార్టీ'