రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రైవేటు ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం.. రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం పన్నెండున్నరకు ప్రఖ్యాత ఛాయా సోమేశ్వరాలయాన్ని సందర్శిస్తారు.
Governor Tamilisai: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్న గవర్నర్ - మహాత్మగాంధీ విశ్వవిద్యాలయం
తొలిసారి ఛాన్స్‌లర్ హోదాలో గవర్నర్ తమిళిసై నేడు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఆమె పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గవర్నర్ వర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.
Governor Tamilisai
అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి చేరుకుంటారు. మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం.. రక్తదాన శిబిరంతోపాటు బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వర్సిటీలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారంపై గవర్నర్ దృష్టిసారించాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఇదీ చూడండి:Governor Tamilisai: రాజ్‌భవన్‌లో బతుకమ్మ పాట.. గవర్నర్ తమిళిసై ఆట!