తెలంగాణ

telangana

ETV Bharat / state

మెకానిక్ షాపులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన బైకులు - FIRE ACCIDENT IN BIKE MECHANIC SHOP

మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలోని ఓ మెకానిక్ షాపులో అగ్ని ప్రమాదం జరిగి దాదాపు 9 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది.

మెకానిక్ షాపులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన బైకులు

By

Published : Nov 20, 2019, 7:34 PM IST

Updated : Nov 20, 2019, 7:50 PM IST

మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం ముందున్న మెకానిక్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. రోజూలాగే గురువారం కూడా తాళం వేసి ఇంటికి వెళ్లాడు షాపు యజమాని. రాత్రి 11 గంటల సమయంలో మెకానిక్ షాపులోంచి పొగలు రావడం గమనించిన స్థానికులు షాపు దగ్గరకి వెళ్లి చుశారు. లోపల నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించి దుకాణం యజమానికి సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మెకానిక్ తాళాన్ని పగలగొట్టి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 9 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మెకానిక్ కంటతడి పెట్టుకున్నాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరాడు.

మెకానిక్ షాపులో అగ్నిప్రమాదం.. కాలిపోయిన బైకులు
Last Updated : Nov 20, 2019, 7:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details