నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని విద్యుత్తు ఉప కేంద్రంలో పేలుడు సంభవించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే భారీ స్థాయిలో మంటలు రావటం వల్ల స్థానికులు భయందోళనకు గురయ్యారు. కామినేని ఆసుపత్రికి అత్యంత సమీపంలో ఉన్న ఉప కేంద్రంలో నియంత్రికలు పేలిపోయి ఈ మంటలు సంభవించినట్లు అధికారులు తెలిపారు.
నార్కట్‌పల్లి విద్యుత్ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం - Fire Accident at Narkatpally power station in Nalgonda District
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి విద్యుత్ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉపకేంద్రంలోని విద్యుత్ నియంత్రికలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
నార్కట్‌పల్లి విద్యుత్ ఉపకేంద్రంలో అగ్నిప్రమాదం
సమాచారం అందుకున్న అగ్ని మాపక యంత్రాంగం మంటలను అదుపులోకి తెచ్చారు. కామినేని ఆసుపత్రి, నార్కట్పల్లితోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు ఈ ఉప కేంద్రం సేవలందిస్తోంది. ఈ ప్రమాదంతో రాత్రి వరకు ఆయా ప్రాంతాలకు విద్యుత్తు సరఫరాను నిలిపివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.