నల్గొండ జిల్లా మిర్యాలగూడ బోటింగ్ పార్క్ వద్ద పెద్ద చెరువులో అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతదేహం లభ్యమైంది. ఒంగోలుకు చెందిన అనూష, సుధీర్ కుమార్ దంపతులు జీవనోపాధి కోసం రెండు సంవత్సరాల క్రితం మిర్యాలగూడ వచ్చి స్థిరపడ్డారు. మృతురాలి భర్త ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతదేహం లభ్యం - nalgonda news
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బోటింగ్ పార్క్ వద్ద పెద్ద చెరువులో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.మృతురాలు పట్టణంలోని వాసవినగర్కు చెందిన అనూషగా పోలీసులు గుర్తించారు.

Breaking News
గత రెండు రోజులుగా అనూష కనిపించడం లేదంటూ ఆమె కుటుంబసభ్యులు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. దీనిపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.