హుజూర్నగర్ ఉప ఎన్నికలకు 28 మంది బరిలో నిలిచారు. మొత్తం 31 మంది పోటీకీ అర్హత సాధించగా... అందులో ముగ్గురు తమ నామపత్రాలను గురువారం ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికలకు అత్యధికంగా 76 నామినేషన్లు, 119 సెట్లు దాఖలు కాగా... 45 మంది తిరస్కరణకు గురయ్యారు. ప్రస్తుతం 28 మంది పోటీలో నిలవటం వల్ల రెండు ఈవీఎంలు ఉపయోగించాల్సి ఉంటుంది.
తిరస్కరణకు గురైన సీపీఎం అభ్యర్ధి నామినేషన్
ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సమయం ముగిసిన తర్వాత 28 మంది పోటీలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 31 మంది బరిలో ఉండగా అందులో ముగ్గురు స్వతంత్రులు నామపత్రాల్ని ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఈ నెల 21న జరగనున్న ఉప ఎన్నికలకు మొత్తం 45 నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీ అయిన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ పత్రాలు కూడా తిరష్కరణకు గురయ్యాయి.