తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగ్రహించిన రైతన్నలు.. న్యాయపోరాటానికి సిద్ధం - fight for seed cheeting

అందిరికీ అన్నం పెట్టే అన్నదాత నోట్లో నకిలీ విత్తనాల వ్యాపారులు మట్టి కొడుతున్నారు. కర్షకుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు. ఆదిత్య అభిరుచి వంగడాల వల్ల నల్గొండ జిల్లాలో వేల ఎకరాల్లో పంట కోల్పోయిన రైతన్నలు సంబంధిత కంపెనీపై పోరాటానికి పూనుకున్నారు. పంటనష్టంతో సర్వం కోల్పోయిన వెయ్యిమంది రైతులకు వెలుగు దివ్వెలా దారి చూపాయి ఈనాడు, ఈటీవీ కథనాలు.

fight-for-seed-cheeting

By

Published : Apr 29, 2019, 3:46 PM IST

అత్యధిక దిగుబడులిచ్చే సన్నరకాలంటూ ప్రచారం చేసి నాసిరకం విత్తనాలు రైతులకు కట్టబెట్టి వేల ఎకరాల్లో పంట నష్టానికి కారణమైన కంపెనీపై అన్నదాతలు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాసిరకం విత్తనాల వల్ల నాలుగు వేల ఎకరాలకు పైగా పంటనష్టం వాటిల్లింది.

కథనాలపై స్పందన

ఈ సమస్యను ఈటీవీ-ఈనాడు గత మార్చిలో వెలుగులోకి తెచ్చింది. స్పందించిన శాస్త్రవేత్తలు, అధికారులు విత్తనాల్లో లోపాలున్నట్లు తేల్చారు. విత్తన తయారీదారులతో పాటు డీలర్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. గరిడేపల్లి, నేరెడుచర్ల, పాలకీడు, హుజూర్​నగర్​ మండలాలకు చెందిన ఐదు దుకాణాల లైసెన్సులు 1983 విత్తన నియంత్రణ ఉత్తర్వు సెక్షన్​ 89 (ఏ) ప్రకారం రద్దు చేశారు. కంపెనీకి కూడా నోటీసులు జారీచేశారు.

ఎంతకాలం తిరగాలి

ఇంతవరకు బాగానే ఉంది. రైతులకు న్యాయం చేసేందుకు మాత్రం అధికారులు తాత్సారం చేస్తున్నారు. జరిగిన నష్టంపై వ్యవసాయాధికారులు పంటలు పరిశీలించి నివేదిక తయారు చేశారు. ఆ నివేదిక ఇచ్చేందుకు రైతులను ఇప్పటికీ ముప్పుతిప్పలు పెడుతున్నారు. వాటి కోసం అన్నదాతలు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పట్టించుకోని అధికారుల తీరుతో విగిసిపోయి న్యాయపోరాటమే శరణ్యమనుకున్నారు. నాసిరంకం విత్తనాలతో సుమారు 20 గ్రామాల్లో బాధిత రైతులు ఉన్నారు.

ఇక్కడైనా న్యాయం జరగాలి

కేవలం పాలకీడు మండలం యల్లాపురంలో మాత్రమే నివేదిక ఇచ్చారు. దీనిని ఆధారం చేసుకుని వినియోగదారుల ఫోరంతో పాటు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కేసువేసేందుకు కర్షకులు సిద్ధమవుతున్నారు.

ఆగ్రహించిన రైతన్నలు.. న్యాయపోరాటానికి సిద్ధం
ఇదీ చదవండి: విక్రయించేందుకు వస్తే ఇన్ని సమస్యలు సృష్టిస్తారా..?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details