నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి నిరసనగా తామూ నామినేషన్లు దాఖలు చేస్తామని ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తెలిపారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామ పత్రాలు తీసుకున్నారు. ఈనెల 30న జిల్లాలోని క్షేత్ర సహాయకులంతా నామినేషన్లు దాఖలు చేస్తారని ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతా కృపాకర్ ప్రకటించారు.
'విధుల్లోకి తీసుకోవాలి.. లేదంటే నామినేషన్లు దాఖలు చేస్తాం'
ప్రభుత్వానికి నిరసనగా సాగర్ ఉపఎన్నికలో నామినేషన్లు దాఖలు చేస్తామని నల్గొండ జిల్లాలోని ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు ప్రకటించారు. సమ్మె చేసినందుకు తమని విధుల నుంచి బహిష్కరించారని.. అందుకు నిరసనగా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. విధుల్లోకి తీసుకుంటే నామినేషన్ల దాఖలును విరమించుకుంటామని తెలిపారు.
ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్ల నామినేషన్లు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక
సమ్మె చేసిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తొలంగించారని.. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమను విధుల్లోకి అనుమతించలేదని వాపోయారు. అందుకు నిరసనగా 300 మంది నామినేషన్లు దాఖలు చేస్తారని ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ నెల 28 వరకు తమని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అలాగైతే తమ నామినేషన్ల దాఖలు నిర్ణయాన్ని విరమించుకుంటామని పేర్కొన్నారు.