నేపాల్లోని ఫోఖ్రా పట్టణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో (Pokhara International championship news) తెలంగాణకు చెందిన తండ్రీకొడుకులు సత్తాచాటారు. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వద్దిరెడ్డి గూడెంకు చెందిన మేకల అభినవ్ రెడ్డి అండర్-17 విభాగంలోని బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం సాధించారు. అతని తండ్రి భాస్కర్ రెడ్డి అండర్-45 విభాగంలోని 10 కే పరుగు పందెంలో రజత పతకం గెలుపొందారు. అంతర్జాతీయ ఛాంపియన్షిప్-2021 (Nepal International championship latest news) పోటీలను భారత్, నేపాల్, శ్రీలంక సంయుక్తంగా ఈ నెల 20 నుండి 25 వరకు నిర్వహిస్తున్నారు.
father and son win: అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటిన తండ్రీకొడుకులు - తెలంగాణ వార్తలు
నేపాల్లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో(Nepal International championship 2021) తెలంగాణకు చెందిన తండ్రీకొడుకులు(father and son win) సత్తా చాటారు. నల్గొండ జిల్లాకు చెందిన మేకల అభినవ్ రెడ్డి అండర్-17 విభాగంలోని బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం సాధించగా... అతని తండ్రి భాస్కర్ రెడ్డి అండర్-45 విభాగంలోని 10 కే పరుగు పందెంలో రజత పతకం సాధించారు.
Nepal International championship
అభినవ్ రెడ్డి తండ్రి క్రీడాకారుడు కావడంతో కుమారునికి శిక్షణ ఇవ్వగా... ఆయన కూడా క్రీడల్లో పాల్గొని దేశానికి పేరు తెచ్చారు. అంతర్జాతీయ ఛాంపియన్షిప్ పోటీల్లో ఇద్దరం గెలవడం సంతోషంగా ఉందని భాస్కర్ రెడ్డి తెలిపారు. శ్రీలంకలో డిసెంబర్ 10 నుంచి జరిగే అంతర్జాతీయ పోటీలతో పాటు... వచ్చే ఏడాది జనవరి 10 నుండి దుబాయిలో జరిగే పోటీల్లో సైతం పాల్గోనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ధోనీ అభిమానులకు గుడ్న్యూస్.. మరో మూడేళ్లు సీఎస్కేతోనే!