నల్గొండ జిల్లా వేములపల్లిలో టోకెన్ల కోసం అన్నదాతలు ఆందోళనకు(Farmers protests for tokens) దిగారు. అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై ధర్నాకు దిగారు. వేములపల్లిలో వ్యవసాయ శాఖ అధికారులు రేపటి నుంచి ఆరో తేదీ వరకు వరి కోసేందుకు టోకెన్లు(Farmers protests for tokens) జారీ చేశారు. 800 టోకెన్లు పంపిణీ చేయాల్సి ఉండగా.. 600 టోకెన్లు మాత్రమే ఇచ్చారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రైతులు రహదారిపై మోహరించారు. వారి ధర్నాతో రోడ్డుపై(Farmers protests for tokens) భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
సూర్యాపేట జిల్లాలోనూ ఇదే పరిస్థితి..