అన్నదాతకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. నల్గొండలోని ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. తాలు, తేమ శాతం రావటం లేదనే సాకుతో మద్దతు ధర ఇవ్వటం లేదని రహదారిపై రాస్తారోకో చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన - telangana varthalu
మద్దతు ధర ఇవ్వడం లేదని నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద అన్నదాతలు రాస్తారోకో చేపట్టారు. ఇప్పటికైనా మద్దతు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన
మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని తాలు ఉందంటూ ఆరబెట్టమని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా మద్దతు ధర కల్పించి... ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పు