నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్లో మార్క్ఫెడ్ సహకారంతో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఫిబ్రవరి 26న కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ..ఇప్పటివరకు 17,500 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. గతవారం రోజులుగా కొనుగోళ్లు జరగట్లేదని.. టోకెన్లు, గోనె సంచుల సాకుతో మార్కెట్ చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులు మార్కెట్ ముందు ధర్నాకు దిగారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా పడినందున కందులు అంతగా పండలేదని.. పండిన కొంచెం పంటను అమ్మకుందామంటే నిబంధనల పేరిట ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్ కంటే దళారులే మేలేమో!
మిర్యాలగూడ, మునుగోడు, తిప్పర్తి, చిట్యాల, నార్కట్పల్లి మండలాల నుంచి రైతులు కందులు తీసుకువస్తున్నారు. మార్కెట్ బంద్ ఉంటే అధికారులు ముందు రోజు తెలియజేయాలని వారు కోరుతున్నారు. ఛార్జీలు, తిండి ఖర్చులు.. రోజుకు రూ. 500 అవుతోందని అన్నదాతలు వాపోతున్నారు.