తెలంగాణ

telangana

ETV Bharat / state

డబ్బుల పడ్డాయంటూ మెసేజ్.. బ్యాంక్‌కి వెళ్తే...!! - Farmers gets Messages from banks

నిరుపేద రైతులకు పంట పెట్టుబడులకు భరోసా ఇచ్చి... అప్పుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతుబంధును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. కానీ అమలులో నిధుల లేమితో రైతులు ఆవేదన చెందుతున్నారు. డబ్బులు పడినట్లు కొందరి రైతుల ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. తీరా బ్యాంక్‌కు వెళ్లి చూస్తే మాత్రం రాలేదని చెబుతున్నారు.

డబ్బుల పడ్డాయంటూ మెసేజ్.. బ్యాంక్‌కి వెళ్తే...!!

By

Published : Oct 22, 2019, 5:39 PM IST

డబ్బుల పడ్డాయంటూ మెసేజ్.. బ్యాంక్‌కి వెళ్తే...!!

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని తోపుచర్ల, పోరెడ్డిగూడెం గ్రామాల్లో మూడు విడతల్లో రైతుబంధు చెక్కులు 60శాతం వరకు జమకాలేదు. ఈ ప్రాంత రైతులు రెండేళ్లుగా రైతుబంధు చెక్కుల కోసం వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

మండల పరిధిలో మొదటి విడత 14వేల 126 మంది రైతుల ఖాతాలను ప్రభుత్వానికి నివేదించగా... వారిలో 12వేల మందికి మాత్రమే రైతుబంధు చెక్కులు మంజూరయ్యాయి. సుమారు 1200 మందికి ఇప్పటి వరకు ఎలాంటి చెక్కులు రాలేదు. రెండో విడత 1900 మందికి రాకపోగా... మూడోవిడత 5వేల 500 మందికి ఇప్పటివరకు చెక్కులు అందలేదు. ప్రత్యేకించి మండలంలోని తోపుచర్ల, పోరెడ్డిగూడెం ప్రాంతాల రైతులకు 60శాతం మందికి రైతుబంధు చెక్కులు జమ కాలేదు.

ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడులకు ముందే రైతుబంధు ప్రకటిస్తామని... వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పినప్పటికీ... ఆచరణలో అమలుకావడం లేదు. సరిపడ సిబ్బంది లేకపోవడం వల్ల రైతులకు ఖాతాలో జమ చేయలేకపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మరో మెలిక ఏమిటంటే... కొందరి రైతులకు వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు డిపాజిట్​ అయినట్లు సందేశం వస్తోందని... కానీ ఖాతాల్లో చూస్తే డబ్బు జమకాలేదని ఆవేదన చెందుతున్నారు.

ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే... కంప్యూటర్​లో సమాచారం వస్తుందని బడ్జెట్​ వచ్చిన తర్వాత వారి ఖాతాల్లో తప్పనిసరిగా జమవుతుందని చెబుతున్నారు. వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేసి తమకు డబ్బులు కేటాయించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.

ఇదీ చూడండి: పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట.. టెండర్ల నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details