నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కేంద్రంలో ఇటీవల ఎరువులు అమ్ముతూ వ్యాపారం చేస్తున్న కిరణ్ అనే యువకుడు 82 మంది రైతులను మోసం చేసి పారిపోయాడు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కిరణ్ రైతులందరికీ కలిపి దాదాపు 40 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంది. వారం రోజుల క్రితం బాధిత రైతులు పెద్దవూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కిరణ్ పరారీలో ఉన్నందున వ్యాపారి బంధువులు, వ్యాపార సంబంధాలు ఉన్న చోట్ల తెలంగాణ రైతు సంఘం, నాగార్జున సాగార్ కమిటీ ఆధ్వర్యంలో బాధితులు ధర్నా నిర్వహించారు. కర్షకులను మోసం చేసిన కిరణ్కి అధికార పార్టీ నేతలు సాయం చేస్తూ... అతన్ని కాపాడుతున్నారని ఆరోపించారు. వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు రావాల్సిన డబ్బుని ఇప్పించాలని డిమాండ్ చేశారు.
ధాన్యం కొని డబ్బులివ్వకుండా పారిపోయాడు - ధర్నా
రైతలకు ఎరువులు అమ్ముతూ.. వారి దగ్గర నుంచే ధాన్యం కొనుగోలు చేసి డబ్బులివ్వకుండా మోసం చేసి పారిపోయాడో యువకుడు. అధికార పార్టీ నాయకుల అండ వల్లే అతను తప్పించుకు తిరుగుతున్నాడని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం కొని డబ్బులివ్వకుండా పారిపోయాడు