తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన - latest news on Farmers' concern over grain moving

త్రిపురారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలంటూ డిమాండ్‌ చేశారు.

Farmers' concern over grain moving
ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన

By

Published : Apr 14, 2020, 12:45 PM IST

నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కొనుగోలు కేంద్రంలో లారీల కొరత కారణంగా గత 3 రోజులుగా తూకం వేసిన ధాన్యం అలాగే నిల్వ ఉండిపోయింది. ఫలితంగా ధాన్యం బస్తాలు ఎండకు ఎండి బస్తాల్లో తరుగు వస్తోందంటూ రైతులు ఆందోళనకు దిగారు. వెంటనే తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు.

బస్తాలు తూకం వేసి.. మిల్లులకు పంపకపోవడం వల్ల 3 రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద కాపలా ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ధాన్యాన్ని తరలించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి:మామకు కరోనా పాజిటివ్... అల్లుడిపై కేసు

ABOUT THE AUTHOR

...view details