నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వ్యవసాయ కార్యాలయం వద్ద ధాన్యం టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. తహసీల్దార్ కార్యాలయంలో మూడు రోజుల క్రితం ఇచ్చిన చీటీల ప్రకారంగా ఈరోజు వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు టోకెన్లు తీసుకుంటున్నారు.
ధాన్యం టోకెన్ల కోసం రోజుల తరబడి రైతుల పడిగాపులు.. - Nalgonda farmers
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వ్యవసాయ కార్యాలయం వద్ద ధాన్యం టోకెన్ల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి క్యూలో వేచి ఉన్నామని రైతులు వాపోయారు.
ధాన్యం టోకెన్ల కోసం రోజుల తరబడి రైతుల పడిగాపులు..
ఉదయం 6 గంటల నుంచి క్యూలో వేచి ఉన్నామని, పంట చేతికొచ్చే సమయంలో రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షం వస్తే ఆరుగాలం పడిన కష్టమంతా వృధా అవుతుందని ఆందోళన చెందుతున్నారు. పంట నష్టం జరిగితే తమను ఎవరు ఆదుకుంటారని వాపోతున్నారు.
- ఇదీ చూడండి :జీహెచ్ఎంసీ ముసాయిదా పద్దు@ రూ.5,600 కోట్లు