ధాన్యం కొనుగోలు కేంద్రంలో అవినీతికి అదుపు లేకుండా పోతోందంటూ రైతులు రోడ్డెక్కిన ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడ్లో జరిగింది. కేంద్రం సిబ్బంది, హమాలీల చేష్టలతో విసిగిపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రం ఎదుట రైతుల ఆందోళన - farmers concerns
నల్గొండ జిల్లా గుర్రంపోడ్లో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ వ్యవసాయ మార్కెట్ ఎదుట రాస్తారోకో చేపట్టారు.
farmers protest
ధాన్యం అమ్మకం విషయంలో.. సీరియల్ విధానాన్ని సరిగా అమలు చేయడం లేదంటూ రైతులు వాపోయారు. దళారుల నుంచి డబ్బులు తీసుకుని కాంటాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వారికి నచ్చజెప్పి నిరసనను విరమింపజేశారు.
ఇదీ చదవండి:చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నారా?