తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతుడి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే వీరేశం - కరోనా మృతుని అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే

రహదారిపై మృతి చెందిన ఓ కరోనా బాధితుడి మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు కూడా ముందుకురాని పరిస్థితి. అలాంటి సమయంలో నల్గొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం... ముందు నిలిచి అంత్యక్రియలు జరిగేందుకు తోడ్పాటు అందించారు. దీంతో ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు.

కరోనా మృతుడి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే వీరేశం
కరోనా మృతుడి అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యే వీరేశం

By

Published : Sep 13, 2020, 4:43 PM IST

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తిలో హోమ్ క్వారంటైన్​లో ఉన్న ఓ కరోనా బాధితుడు(50)... బయటకు వెళ్లి రహదారిపై మృతి చెందాడు. కరోనా రోగి కావడం వల్ల... చాలా సేపటి వరకు ఎవరూ అతని దగ్గరికి రాలేదు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కడికి చేరుకున్నారు. గ్రామ నాయకులు యాదగిరిరెడ్డి, వీరయ్య, మృతుని సోదరుడు, గ్రామ యువకుల సహకారంతో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

మృతదేహాన్ని తరలించడంలో వేముల వీరేశం స్వయంగా సాయపడ్డారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సమస్యలతో గత పదిహేనేళ్లుగా భార్య, కొడుకు వేరే గ్రామంలో నివాసం ఉంటున్నారు. మృతుడు కడపర్తిలోనే ఉంటూ... కూలి పనులతో జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాన్ని పూడ్చే సమయంలో భార్య, కుమారుడు అక్కడికు చేరుకున్నారు.

ఇదీ చూడండి:రెవెన్యూ శాఖలో కొత్త పోస్టులు... కసరత్తు ప్రారంభించిన అధికారులు...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details