తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి హెచ్చరిక పంపాలి: జానారెడ్డి - ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో కుందూరు జానారెడ్డి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో... మేధావులు తెరాస ఓడించాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

farmer clp leaders kunduru janareddy in miryalaguda congress meeting
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి హెచ్చరిక పంపాలి: జానారెడ్డి

By

Published : Nov 2, 2020, 5:39 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో... వరంగల్​-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై... దిశా నిర్దేశం చేశారు. 2017కు ముందు డిగ్రీ పాసైన పట్టభద్రులందరూ... ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మండలాలు, గ్రామాల వారీగా పార్టీ శ్రేణులు జాబితా తయారు చేసి అవగాహన కల్పించాలన్నారు.

ప్రత్యేక తెలంగాణ ఆంక్షలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి పరిపాలన సాగించడం లేదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడమే కాకుండా... అడుగడుగునా అబద్ధాలు చెప్పి ప్రజలను భ్రమింపచేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ... పోలీసులను పెట్టి రాజ్యమేలాలని చూడటం సరికాదు. అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పేందుకు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసను ఓడిస్తే అది వారికి హెచ్చరిక అవుతుంది.

జానారెడ్డి, కాంగ్రెస్ నేత

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు నర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నూకల వేణులగోపాల్ రెడ్డి, పొదిల శ్రీను, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ సంతకాల సేకరణ

ABOUT THE AUTHOR

...view details