పేద ప్రజలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల పట్టాలను ఫోర్జరీ సంతకాలతో ఓ ప్రజాప్రతినిధి విక్రయిస్తున్న ఘరానా మోసం వెలుగుచూసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురంలో బుడగ జంగాలకు 2010లో ప్రభుత్వం కేటాయించింది. ఒక్కసారిగా భూముల ధరలు పెరగడంతో వాటిపై ప్రజాప్రతినిధి కన్నుపడింది. ఏకంగా మాజీ తహాసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి మోసానికి తెరలేపాడు. స్థానిక బుడగజంగాల ప్రజలు ఈటీవీ భారత్కు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బట్టబయలైంది.
భూముల ధరలు పెరగడంతో.....
అవంతిపురంలోని 628 సర్వేనెంబర్లో 8.04 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గతంలో 243 మంది నిరుపేదలకు 2010లో ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అదే గ్రామంలో వ్యవసాయ మార్కెట్, మిషన్ భగీరథ శుద్ధి కేంద్రం, గురుకుల పాఠశాల, కళాశాల,బధిర ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో భూముల ధరలు రెక్కలు వచ్చాయి. దీన్ని సొమ్ము చేసుకోవాలని భావించిన ఓ ప్రజాప్రతినిధి తనదైన శైలిలో పట్టాలపై ఫోర్జరీ సంతకాలు చేసి పట్టాలు విక్రయించాడు. 2010లో మిర్యాలగూడలో పనిచేసిన తాహసీల్దారు సంతకంతో పట్టాలను రూపొందించి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అక్రమ పట్టాలు పొందిన కొందరు వ్యక్తులు తరచూ అటువైపుగా వెళ్లి స్థలాన్ని పరిశీలిస్తుండటంతో స్థానికంగా వుండే బుడగజంగాల వారికి అనుమానం వచ్చి మీడియాకు సమాచారం అందించారు.
మైనర్ పేరుతో ఇంటి పట్టా