తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​ పోరు​: పలు కేంద్రాల్లో మొరాయిస్తున్న ఈవీఎంలు - nagarjuna sagar by polls latest news

నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 346 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నారు.

NAGARJUNA SAGAR
సాగర్​ దంగల్​: మొరాయిస్తున్న ఈవీఎంలు

By

Published : Apr 17, 2021, 8:23 AM IST

Updated : Apr 17, 2021, 9:47 AM IST

తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు. అయితే త్రిపురారం 265 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. ఫలితంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. గుర్రంపోడు మండలంలో వట్టికోడులోని 13 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. నాగార్జునసాగర్ హిల్‌ కాలనీలో పోలింగ్ స్టేషన్ 100లో ఇంకా ప్రారంభం కాలేదు. ఏజెంట్స్ ఆలస్యంగా రావడంతో మొదలుకాలేదు.

హాలియాలోని ఇబ్రహీంపేటలో తెరాస అభ్యర్థి నోముల భగత్ ఓటు వేశారు. కుటుంబసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Last Updated : Apr 17, 2021, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details