తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు పాటించని పెట్రోల్​బంకుకు జరిమానా - nalgonda petrol bunk fine

నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్​లో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంకుకు పెట్రోల్‌ కంపెనీ సేల్స్‌ అధికారులు రూ. 11 వేల జరిమానా విధించారు. బంకులో కనీస సౌకర్యాలు లేవంటూ ఓ వినియోగదారుడు ఫిర్యాదుతో అధికారులు తనిఖీలు చేశారు.

Essar petrol bunk fine in nalgonda district
నిబంధనలు పాటించని పెట్రోల్​బంకుకు జరిమానా

By

Published : Oct 29, 2020, 10:42 AM IST

Updated : Oct 29, 2020, 11:25 AM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని శివాజీనగర్​లో ఉన్న ఎస్సార్​ పెట్రోల్ బంకుకు.. పెట్రోల్‌ కంపెనీ సేల్స్‌ అధికారులు రూ. 11 వేల జరిమానా విధించారు. బంకులో కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఓ వినియోగదారుని ఫిర్యాదుతో స్పందించిన పెట్రోల్‌ కంపెనీ సేల్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

పెట్రోల్ బంకులో ఉచిత గాలి యంత్రం లేనందుకు రూ. 10 వేలు, సిబ్బంది షూస్ వేసుకోనందుకు రూ. 1,000 జరిమానా విధించారని బంకు యజమాని వెంకటేశ్వర్లు తెలిపారు.

ఇదీ చూడండి:విధుల్లో అనైతికంగా ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్​

Last Updated : Oct 29, 2020, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details