నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. పకృతిని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటిని ఉపయోగించి పండించే పంటలను ఎన్నుకోవాలని కోరారు. రైతుబంధు పథకం ద్వారా 36,38,000 మంది రైతులకు 307 కోట్ల రూపాయలు అందించామని వెల్లడించారు. రాష్ట్రంలో 12,013 మంది రైతులు చనిపోతే రైతు బీమా కింద 5 లక్షల చొప్పున 6,636 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. రైతులు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించుకోవాలని సూచించారు.
ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా
రబీ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్‌లో ఏరువాక కార్యక్రమాన్ని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా