నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల సమీపంలో ఉన్న మెదుగులకుంట తండాలో 87, కపూర్‌తండాలో 86 కుటుంబాలు సర్వస్వం కోల్పోతున్నాయి. వీరికి మెరుగైన పునరావాసం ప్యాకేజీ కల్పించాల్సిన అవసరం ఉందని.... జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే 'రిహాబిలిటేషన్ రీ సెటిల్మెంట్ కమిటీ ' 2016 ఫిబ్రవరి 18న తీర్మానించింది.
ప్రభుత్వం హామీ విస్మరించింది
నిర్వాసితులు అందరికీ గతంలోనే తొలివిడతగా పునరావాస ప్యాకేజీ ఇచ్చారు. ఇల్లు కోల్పోతున్న వారికి సమీపంలోని శాంతినగర్‌లో తాజాగా ప్లాట్లు ఇచ్చారు. అర్హులైన వారికి ప్రాజెక్టు నిర్మాణంలోనే ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మిర్యాలగూడ ఆర్డీఓ కేంద్రంగా అవకతవకలు