తెలంగాణ

telangana

ETV Bharat / state

4 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి: దుబ్బాక నర్సింహారెడ్డి

ప్రభుత్వం ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల భారం మోపడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. లాక్​డౌన్ కాలంలో నాలుగు నెలల కరెంట్ బిల్లులు మాఫీ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.

'కరోనా కాలం 4 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి'
'కరోనా కాలం 4 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి'

By

Published : Jul 6, 2020, 5:20 PM IST

Updated : Jul 7, 2020, 7:22 AM IST

4 నెలల విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి: దుబ్బాక నర్సింహారెడ్డి

అధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిరసిస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం ముందు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో కుటుంబాలు ఆర్ధిక పరిస్థితులు బాగోలేక ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం దొడ్డిదారిన ప్రజలపై అధిక విద్యుత్ చార్జీలు పెంచడం ఏమిటని ప్రశ్నించారు. గత కాంగ్రెస్ సర్కార్ హయాంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీలకు 50 యూనిట్ల మేర విద్యుత్​ను ఉచితంగా ఇచ్చారని దుబ్బాక గుర్తు చేశారు.

కేసీఆర్ సర్కార్ దోచుకుంటోంది...

కేసీఆర్ సర్కార్ మాత్రం ఎస్సీలకు ఉచిత కరెంట్ ఇవ్వకపోగా విపరీతంగా ఛార్జీలు వడ్డిస్తూ ప్రజలను దోచుకుంటోందని దుబ్బాక నర్సింహారెడ్డి మండిపడ్డారు. ప్రజల నుంచి అధిక విద్యుత్ ఛార్జీలను బలవంతంగా వసూలు చేస్తున్నారని... కట్టకపోతే కరెంట్ కట్ చేస్తున్నారని విమర్శించారు. కరోనా క్లిష్ట కాలంలో 4 నెలల కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

Last Updated : Jul 7, 2020, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details