గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి ఇంకా రాజుకుంటూనే ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేయలేదంటూ దాడులకు దిగుతున్నారు. వారి ఓట్ల కోసం కుటుంబాలను బలి తీసుకుంటున్నారు.
ఘర్షణలో పలువురికి గాయాలు
By
Published : Feb 18, 2019, 1:27 PM IST
తెలుగుపల్లిలో ఘర్షణ
నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తెలుగుపల్లిలో కాంగ్రెస్, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదని ఇరువర్గాలు పరస్పర రాళ్ల దాడికి దిగాయి. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.