నల్గొండ జిల్లా పెద్దవూర మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన మేకల వెంకట్ రెడ్డి(50)ది మధ్య తరగతి కుటుంబం. వెంకట్ రెడ్డి కాలేయం సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. పూట గడవడమే కష్టంగా ఉండే ఆ కుటుంబానికి వైద్యం చేయించడం కష్టంగా మారింది.
కన్న తండ్రి చితికి నిప్పు పెట్టిన కుమార్తె - కొత్తలూరు గ్రామం తాజా వార్తలు
కంటికి రెప్పలా కాపాడే కన్న తండ్రిని కాలేయం సంబంధిత వ్యాధి.. బలి తీసుకుంది. పుట్టెడు దుఃఖంతో తండ్రికి పెద్దకూతురు స్వప్న తలకొరివి పెట్టింది. ఈ హృదయ విదారకర ఘటనతో గ్రామస్థులు కంటతడిపెట్టారు.

కన్న తండ్రి చితికి నిప్పు పెట్టిన పెద్ద కుమార్తె
ఈ క్రమంలో సోమవారం అస్వస్థతకు గురై వెంకట్ రెడ్డి మృతిచెందాడు. మృతుడికి భార్య జలేంద్ర, ఇద్దరు కుమార్తెలు స్వప్న , స్వాతి ఉన్నారు. ఇద్దరికి వివాహం చేశారు. దుఃఖంతో పెద్దకుమార్తె స్వప్న.. తన తండ్రికి చితి పెట్టి పెద్ద కొడుకుగా మారింది.
ఇవీ చూడండి:హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్