నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో పార్టీలకతీతంగా దాతలు ముందుకొస్తున్నారు. ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ మర్ల అలివేలు రాంరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామంలో 28వేల కోడిగుడ్లు పంపిణీ చేశారు. రేషన్ కార్డుతో వచ్చిన వారికి పంపిణీ చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. గ్రామస్థులు భౌతికదూరం పాటిస్తూ కోడిగుడ్లు తీసుకునేందుకు తరలొచ్చారు.
నేరడ ఎంపీటీసీ దాతృత్వం..28వేల కోడిగుడ్లు పంపిణీ - నేరడ వార్తలు
లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు నిత్యావసరాలు, పౌష్టికాహారం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ఓ తెరాస ఎంపీటీసీ తన గ్రామంలోని నిరుపేదలకు 28వేల కోడిగుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకతీతంగా నాయకులు పాల్గొన్నారు
నేరడ ఎంపీటీసీ దాతృత్వం..28వేల కోడిగుడ్లు పంపిణీ
ఈ కార్యక్రమంలో Zptc సుంకరి ధనమ్మ యాదయ్య, Mpp కొలను సునీత వెంకటేష్‌గౌడ్, మాజీ సర్పంచ్ ఎల్లయ్య, తెరాస నాయకులు కార్పొరెట్ బ్యాంక్ డైరెక్టర్ వడ్డపల్లి వెంకన్న, కోటయ్య, సీపీఎం నాయకులు కల్లూరి లక్ష్మయ్య, సంకోజు నర్సింహచారి పాల్గొన్నారు. కరోనా కాలంలో దాతృత్వం చాటుకున్న అలివేలు రాంరెడ్డిని అభినందించారు. పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
Last Updated : Apr 24, 2020, 11:36 AM IST