నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తాళ్లగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలో బోనాల పండగ పేరుతో గురువారం రాత్రి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. పాఠశాల ఆవరణలో విందు భోజనాలు చేసి, మద్యం సేవించి.. సీసాలు, గ్లాసులు, ప్లేట్లు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న మిర్యాలగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రభుత్వ పాఠశాలలో మందు-చిందు - ప్రభుత్వ పాఠశాల
బోనాల పండగ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది.
ప్రభుత్వ పాఠశాలలో మందు-చిందు