నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో... నాలుగు రోజులపాటు దర్శనాలు నిలిపివేస్తున్నారు. ఈనెల 19 నుంచి 22 వరకు భక్తులకు ప్రవేశం లేదని... స్థానిక ఎమ్మల్యే, ఆర్డీవో ప్రకటించారు. ఇక్కడ ప్రతి అమావాస్యకు వేల సంఖ్యలో ఆలయానికి వచ్చే భక్తులు... రాత్రి పూట నిద్ర చేస్తే మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఈనెల 21న అమావాస్య దృష్ట్యా ముందుగానే భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున... దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ముందస్తుగా తెలిపారు. కొవిడ్ తీవ్రత దృష్ట్యా ఏకకాలంలో పెద్దసంఖ్యలో వస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో భక్తుల రాకపై నిషేధం విధించారు.
ఈ అమావాస్యకు చెరువుగట్టు దర్శనాల నిలిపివేత - Cheruvugattu temple latest updates
ప్రతి అమావాస్యకు వేల సంఖ్యలో భక్తులు వచ్చే ప్రసిద్ధ శైవ క్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈనెల 19 నుంచి 22 వరకు భక్తులకు ప్రవేశం లేదని తేల్చారు.
ఈ అమావాస్యకు చెరువుగట్టు దర్శనాల నిలిపివేత