తెలంగాణ ప్రజలను తాగించడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలవాలని చూస్తున్నారని డా.చెరకు సుధాకర్ విమర్శించారు. మద్యం అమ్మకాలపై వచ్చే రాబడితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా సాగర్ హిల్‌కాలనీలో సమావేశం నిర్వహించారు. అధిక విద్యుత్ వాడకమే రాష్ట్ర అభివృద్ధి అని చెప్పడం తప్పన్నారు.