కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పలు ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతుండగా... కొంతమంది నిబంధనలు పాటించట్లేదు. నల్గొండ జిల్లా అడవి దేవులపల్లి మండలం బాలెంపల్లిలో జరిగిన ఓ వివాహ వేడుకలో మద్యం మత్తులో డీజే పెట్టుకుని యువత డాన్సులు చేశారు. భౌతికదూరాన్ని గాలికొదిలేసి గుంపులుగా నృత్యాలు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు.
పెళ్లి వేడుకలో డీజే డాన్సులతో యువత హల్చల్...
కొవిడ్ ఉద్ధృతి తగ్గించడానికి ఓ వైపు అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటే... కొంతమంది అవేవి పట్టనట్లు పెళ్లి వేడుకల్లో డీజేలు పెట్టుకుని గుంపులుగుంపులుగా డాన్సులు చేస్తున్నారు. భౌతికదూరాన్ని గాలికి వదిలేసి... సామాజిక బాధ్యతను అటక మీద పెట్టేసి... స్థానికులను భయాందోళనలోకి నెట్టేసి నృత్యాలు చేస్తున్నారు.
పెళ్లి వేడుకలో డీజే డాన్సులతో యువత హల్చల్...
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా... సామాజిక బాధ్యత లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు. వారి చేష్టలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక అవగాహన లేకుండా అందర్నీ ప్రమాదంలో పడేసే వేడుకలు మరొకసారి జరగకుండా చూడాలని ఆ ప్రాంత ప్రజలు పోలీసులను వేడుకుంటున్నారు.
ఇదీ చదవండిఃకొవిడ్ బాధితులకు పరీక్షల నుంచి చికిత్సల వరకు అడ్డంకులే
Last Updated : Jul 25, 2020, 10:59 PM IST