నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన కూలీలకు, పేదలకు ఎమ్మెల్యే భాస్కర రావునిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా జీవితాన్ని ఇచ్చిన పుట్టిన గడ్డలోని పేదవారిని కష్ట కాలంలో ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో విజయ్ కుమార్ పట్టణంలోని సుందర్ నగర్‌కు చెందిన 600 మందికి కిరాణా సామగ్రి అందజేశారు. సుమారు 5 కేజీల బియ్యం, కిలో కందిపప్పుతో పాటు సరుకులను అందజేశారు. విజయ్ కుమార్ హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ లాక్డౌన్ కాలంలో పేద వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నిత్యావసరాలను పంపిణీ చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు.
మిర్యాలగూడలో కూలీలకు కిరాణా సామగ్రి పంపిణీ - MIRYALAGUDA, NALGONDA DISTRICT
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాక్డౌన్ నిబంధనల వల్ల ఉపాధి కోల్పోయిన కూలీలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు చేతుల మీదుగా సరుకులు అందించారు.
దివ్యాంగురాలికి నిత్యావసర సరకులు పంపిణీ