నల్గొండ జిల్లా మిర్యాలగూడ కూరగాయల మార్కెట్లో కరోనా నిర్మూలన కోసం డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రారంభించారు. కూరగాయల మార్కెట్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లే టన్నెల్‌ను ఏర్పాటు చేశారు.
మిర్యాలగూడ మార్కెట్లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ - మిర్యాలగూడ మార్కెట్లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను ఎమ్మెల్యే భాస్కర్ రావు ప్రారంభించారు. స్థానిక కూరగాయల మార్కెట్లో ఈ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలంతా ఈ టన్నెల్ గుండానే రాకపోకలు సాగించాలని ఎమ్మెల్యే సూచించారు.
![మిర్యాలగూడ మార్కెట్లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ టన్నెల్ గుండానే రాకపోకలు సాగించాలి : ఎమ్మెల్యే](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6720495-thumbnail-3x2-tunnel.jpg)
టన్నెల్ గుండానే రాకపోకలు సాగించాలి : ఎమ్మెల్యే
దుస్తులపైన, శరీరంపైన ఉన్న క్రిములు చనిపోయి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ టన్నెల్ దోహద పడుతుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ టన్నెల్ గుండానే రాకపోకలు సాగించాలని ఎమ్మెల్యే భాస్కర్ రావు కోరారు. కరోనా వైరస్ వ్యాప్తించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.