భూమి కోసం... ధరణి దీక్ష... - తెలంగాణ తెలుగు వార్తలు
ఐరాస వ్వవస్థాపక దినోత్సవం సందర్భంగా మునుగోడులో ధరణి దీక్ష చేపట్టారు. గోతి తవ్వి అందులో ఛాతీ భాగం మునిగే వరకు పూడ్చుకున్నారు. భూమిని కాపాడాలని తెలియజేయడమే ఈ దీక్ష ఉద్దేశం అని నిర్వాహకులు తెలిపారు.
భూమి కోసం... ధరణి దీక్ష...
ఐక్యరాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వైబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఆధ్వర్యంలో మునుగోడులోని స్థానిక శ్రీసిద్ధార్థ డీగ్రీ కళాశాలలో ధరణి దీక్ష చేపట్టారు. భూమిలో ఛాతి వరకు పూడ్చుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. రానున్న రోజుల్లో నివసించాలంటే భూమిని కాపాడుకోవాలని తెలిపారు. స్థానిక తహసీల్దార్ జ్ఞానేశ్వర్ దేవ్ టీఈఎస్ఎఫ్ అధ్యక్షుడు జీడిమెట్ల రవీందర్ పాల్గొన్నారు.