నల్గొండ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో సుమారు 8 వందల మంది విద్యార్థులు నేలపైనే కూర్చుని చదువుకుంటున్నారు. నిత్యం సుమారు ఆరు గంటల పాటు కింద కూర్చుని అమ్మాయిలు పడుతున్న వేదనపై ఈటీవీ భారత్లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. మూడు స్వచ్ఛంద సంస్థలు సైతం సాయం చేసేందుకు కళాశాల వివరాలు సేకరించాయి. ఈలోపే ఎమ్మెల్యే కళాశాలకు చేరుకుని విద్యార్థినులు, అధ్యాపకులతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ నుంచి బెంచీలు తెప్పిస్తామని భరోసానిచ్చారు.
డిగ్రీ కళాశాలలో నేలపై చదువులు..ఈటీవీ భారత్ కథనానికి స్పందన - styory
నల్గొండ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో 'నేల చదువులపై ప్రసారమైన ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. స్థానిక శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి కళాశాలను సందర్శించారు.
డిగ్రీ కళాశాలలో నేలపై చదువులు..ఈటీవీ భారత్ కథనానికి స్పందన