కృష్ణా నదిలో ఎగువ నుంచి ప్రవాహం క్రమంగా తగ్గిపోతూ వస్తోంది. గురువారం ఉదయం ఆలమట్టి వద్ద 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సాయంత్రానికి 80 వేలకు పడిపోయింది. దీంతో దిగువకు కూడా 80 వేలే వదులుతున్నారు. నారాయణపూర్ నుంచి కూడా దిగువకు నీటి విడుదల తగ్గింది. జూరాలకు 1.71 లక్షలు వస్తుండగా 1.46 లక్షలు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి 29 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలానికి 1.52 లక్షలు వస్తుండగా ఏపీ, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తితోపాటు స్పిల్‌వే ద్వారా 2.02 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు.
నాగార్జునసాగర్‌కు రాత్రి 7 గంటల వరకు 2.85 లక్షలు రాగా డ్యాం నుంచి 16 గేట్లను ఎత్తి 2.38 లక్షలు దిగువకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ఇన్‌ఫ్లో 2,50,136 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 1,68,025 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 588.80 అడుగుల వద్ద ఉంది.