తెలంగాణ

telangana

ETV Bharat / state

KRISHNA RIVER: జలాశయాల్లో వరద తగ్గుముఖం.. దిగువకు నీరు! - telangana 2021 news

ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్​లకు ఇంకా వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే వరదలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. అయినప్పటికీ... అధికారులు గేట్లను ఎత్తుతూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

decreasing-flood-to-srisailam-jurala-and-nagarjunasagar
జలాశయాలకు తగ్గుతున్న వరద.. నీటిని దిగువకు వదులుతున్న అధికారులు..

By

Published : Aug 4, 2021, 10:26 AM IST

Updated : Aug 4, 2021, 10:46 AM IST

ఎగువు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. జలాశయంలో నీటి స్థాయి పెరగడంతో అధికారులు 4 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వ 212.43 టీఎంసీలు కాగా... పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8 టీఎంసీలుగా ఉంది. జలాశయం ఇన్‌ఫ్లో 2,17,638 క్యూసెక్కులు కాగా... ఔట్‌ఫ్లో 1,73,595 క్యూసెక్కులుగా నమోదైంది.

జూరాలకు తగ్గుతున్న వరద..

జూరాల జలాశయానికి క్రమంగా వరద తగ్గుతుంది. జలాశయం ఇన్‌ఫ్లో లక్షా 86 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటిమట్టం 318.51 మీటర్లు కాగా... ప్రస్తుత నీటిమట్టం 317.72 మీటర్లుగా నమోదైంది. జలాశయంలో నీటి నిల్వ స్థాయిలి పెరిగినందును లక్షా 87 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటినిల్వ 8.06 టీఎంసీలుగా ఉంది. జలాశయం కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ఇంకా కొనసాగుతూనే ఉంది.

నాగార్జునసాగర్ 4 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం త్గుగతోంది. సాగర్‌ 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ఇన్‌ఫ్లో 1.09 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 68 వేల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 588.2 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలుకాగా... ప్రస్తుత నీటి నిల్వ 306.69 టీఎంసీలుగా ఉంది.

ఇదీ చూడండి:Srisailam: జలాశయానికి భారీగా వరద నీరు.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

Last Updated : Aug 4, 2021, 10:46 AM IST

ABOUT THE AUTHOR

...view details