నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నిందితుడు మారుతీరావుకు చెందిన షెడ్డులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మిర్యాలగూడ నార్కట్‌పల్లి - అద్దంకి ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలోని ఓ పాత రేకుల షెడ్లో దుర్వాసన వస్తుండటం వల్ల స్థానికులు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు షెడ్డును పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వారం రోజుల క్రితం హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహంపై దుండగులు ఆయిల్ పోసి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. నల్గొండ నుంచి వచ్చిన క్లూస్‌టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు, వేలిముద్రలు సేకరించింది.
మారుతీరావు షెడ్డులో.. మృతదేహం లభ్యం.. - మిర్యాలగూడలోని మారుతీరావు, ప్రణయ్ హత్యకేసు
మారుతీరావు షెడ్డులో.. మృతదేహం లభ్యం..
19:27 February 29
.
Last Updated : Feb 29, 2020, 11:58 PM IST