నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివేల, కోతులరాం గ్రామాల మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలో పత్తి నింపుకొని వస్తున్న డీసీఎం ఎదురుగా వస్తున్న ద్విచక్రవహానాన్ని తప్పించబోయి... బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ఉన్న 12 మంది కూలీలు గాయపడ్డారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా... హైదరాబాద్కు తరలించారు. ఇద్దరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బోయ యాదయ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలిపారు. మిగతా వారి పరిస్థితి 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారు. కూలీలంతా కిష్టాపురం గ్రామానికి చెందిన రోజువారి కూలీలుగా గుర్తించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు తెలిపారు.
డీసీఎం బోల్తా... 12 మంది కూలీలకు గాయాలు - ACCIDENT NEWS IN NALGONDA
నల్గొండి జిల్లా కోతులారం వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని హైదరాబాద్ తరలించారు. కొత్తపేటలోని సాయిసంజీవని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు కూలీల పరిస్థితి విషమంగా ఉంది.

DCM ACCIDENT AT NALGONDA DISTRICT DAULY LABOURS INJURED
నల్గొండ ప్రమాద బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమం...
ఇవీ చూడండి: ఫంక్షన్హాల్లో కూలిన గోడ... నలుగురు మృతి
Last Updated : Nov 10, 2019, 10:48 PM IST