తెలంగాణ

telangana

ETV Bharat / state

'హామీలు నెరవేర్చాకే సాగర్ ఉప ఎన్నికలో ఓట్లు అడగాలి'

కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేశాకే సాగర్ ఉప ఎన్నికలో ఓట్లు అడగాలని నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ డిమాండ్ చేసింది. మాయ మాటలు చెప్పి గిరిజన ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. త్రిపురారంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించింది.

By

Published : Jan 16, 2021, 5:21 PM IST

Congress meeting with tribal community leaders
గిరిజన సంఘం నాయకులతో కాంగ్రెస్​ సమావేశం

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేశాకే సాగర్ ఉప ఎన్నికలో ఓట్లు అడగాలని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. త్రిపురారంలో పార్టీ గిరిజన సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు.

అదే బాటలో..

గిరిజనులకు 9శాతం రిజర్వేషన్ అమలు జరిపిన తర్వాతే సాగర్ ఉప ఎన్నికల్లో వారి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. వాళ్లకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంకా ఇవ్వలేదని ఆరోపించారు. తెరాస నుంచి ఆదివాసులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అదే బాటలో కాంగ్రెస్ నడుస్తుందని పేర్కొన్నారు.

కృష్ణ పట్టే ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. తక్షణమే వాటికి పట్టాలు ఇవ్వాలి. సీఎం కేసీఆర్ మాయ మాటలు చెప్పి గిరిజనుల ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు.

-శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి:'ఎమ్మెల్సీలో ఏం చేద్దాం.. సాగర్​లో ఎలా ముందుకెళదాం'

ABOUT THE AUTHOR

...view details