Daida Veeraya Get Phd Degree From Osmania University: నల్గొండ జిల్లాకు చెందిన వీరయ్య తెలుగులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీపట్టా పొందారు. మిర్యాలగూడ మండలానికి చెందిన వీరయ్య తన స్వగ్రామమైన నందిపాడులో ప్రాథమిక విద్యాభాస్యాన్ని పూర్తి చేశారు. పదో తరగతిని మిర్యాలగూడలోని బకాల్ వాడీలో, సాకేత జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్‌ను పూర్తి చేశారు. నాగార్జున కాలేజీలో డిగ్రీని పూర్తి చేశారు. ఎంఏ తెలుగును ఉస్మానియా వర్శిటీలోని ఆర్ట్స్ కాలేజీలో పూర్తి చేశారు. నెట్ (జాతీయ అర్హత పరీక్ష)లో క్వాలిఫై అయిన అనంతరం జేఆర్ఎఫ్(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్)కు ఎంపికయ్యారు.
ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు కొత్త నిబంధనలు
Phd Candidate Daida Veeraya Details : కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా వీరయ్య పని చేశారు. ఓయూలోని తెలుగు శాఖలో పీహెచ్‌డీ ప్రవేశం పొందారు. అక్కడే తన పరిశోధనను పూర్తి చేశారు. వీరయ్య(Daida Veeraya) రాసిన పదికి పైగా ఆర్టికల్స్ పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 2019లో లాంగ్వేజ్ పండిట్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలోని సూరారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంతో పాటు పలు సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను పోషించారు.
Auto Driver's Wife Got PhD: 'సెల్యూట్ టు షీలా..' కష్టాలు అధిగమించి.. పీహెచ్‌డీ సాధించిన గృహిణి